అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. అలాగే చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని ఆయన ఆరోపించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ వ్యాప్తి నిర్మూలించడానికి తగిన విధంగా స్పందించడంలో విఫలమైందని అన్నారు. చైనా ప్రభుత్వం కొత్త భద్రతా చట్టాన్ని విధించినందున హాంకాంగ్ కోసం ప్రత్యేక వాణిజ్య ప్రయోజనాలను ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. WHO కి అతిపెద్ద వనరుగా యుఎస్ ఉంది.. ఇప్పుడు ఆ దేశం నిష్క్రమణతో సంస్థకు ఇబ్బందులు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.