Donald Trump: డొనాల్డ్ ట్రంప్‎నకు బిగ్ రిలీఫ్..2020 నాటి ఆ కేసు కొట్టివేత

Update: 2024-11-26 03:09 GMT

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నకు భారీ ఊరట లభించింది. 2020 నాటికి ఎన్నికల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ నకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. తాజాగా 2020 నాటి ఎన్నికల కేసును న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పై ఉన్న 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. కేసును తొలగించడం సముచితమని ఈ తీర్పు అధ్యక్షుడి పదవిలో ఉన్నంత వరకు మాత్రమే. బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

2020 ఎన్నికల నాటి కేసు కొట్టివేయడంపై ట్రంప్ కూడా స్పందించారు. ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి అన్నారు. మాపై పోరాడేందుకు మా ప్రత్యర్థులైన డమోక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100 మిలియన్ డాలర్లు వేస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా మనదేశంలో ఇలాంటివి జరగలేదని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన రాసుకొచ్చారు.


2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్ హౌస్ నుంచి పలు కీలక దస్త్రాలను తరలించారని ఆరోపిస్తూ పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులు ఎప్పుడూ విచారణకు రాకపోవడం కూడా గమనార్హం. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణకు ఎదుర్కొకుండా వారికి రక్షణ కల్పిస్తుంది.

ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరికొన్ని రోజుల్లో ఆయన బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. దీంతో గతంలో ఆయనపై నమోదు అయిన పలు కేసుల్లో భారీ ఊరట లభిస్తుంది. ఇటీవల హష్ మనీ కేసులో ట్రంప్ నకు శిక్ష ఖరారు అయినప్పటికీ...ఆ శిక్షణు నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్ జడ్జీ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News