Plane Crash: కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం
కజకిస్తాన్(Kazakhstan ) లో బుధవారం విమానం (Flight)కుప్పకూలింది.
కజకిస్తాన్(Kazakhstan ) లో బుధవారం విమానం (Flight)కుప్పకూలింది. కూలిన విమానం అజర్ బైజాన్ ( Azerbaijan Airlines) ఎయిర్ లైన్స్ సంస్థదిగా గుర్తించారు. ఈ విమానం కూలిన సమయంలో 105 మంది ప్రయాణీకులున్నారు. ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు.
బాకూ నుంచి రష్యా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. వాతావరణం సరిగా లేని కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. మంచు కురుస్తున్నందున అక్టౌ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఫ్లైట్ వెళ్తూ కూలిందని అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్టుపై చక్కర్లు కొడుతూ విమానం కూలిందని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో ఆరుగురిని రక్షించినట్టు రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.