Bangladesh To India: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న బంగ్లాదేశ్

Bangladesh Govt requests India for Sheik Hasina's extradition: ఇండియాలో తలదాచుకున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించండని కోరుతూ బంగ్లాదేశ్ డిసెంబర్ 23న ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-25 14:45 GMT

Bangladesh Govt requests India for Sheik Hasina's extradition: ఇండియాలో తలదాచుకున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించండని కోరుతూ బంగ్లాదేశ్ డిసెంబర్ 23న ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయమై మరోసారి స్పందించిన మహమ్మద్ యూనస్ సర్కారు... భారత్ త్వరగా స్పందించాలని కోరింది. భారత్ స్పందన కోసం వేచిచూస్తామని, అప్పటికీ స్పందించకపోతే మరో లేఖ ద్వారా షేక్ హసీనాను వీలైనంత త్వరగా అప్పగించడం అనేది తమకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ మరో లేఖ రాస్తామని బంగ్లాదేశ్ అభిప్రాయపడింది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ ఒప్పందం ఉందని అని యూనస్ సర్కారు గుర్తుచేసింది. ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ ఒప్పందం అంటే... ఒక దేశంలో నేరం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ కేసు విచారణ తప్పించుకునేందుకు మరో దేశం పారిపోతే.. వారిని తిరిగి సొంత దేశానికి రప్పించేందుకు ఈ ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ ఒప్పందం పనికొస్తుంది. భారత్ - బంగ్లాదేశ్ మధ్య కూడా ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఉంది.

బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తోహిద్ హుస్సేన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిపై కేసులు నమోదయ్యాయి. కీలక పదవుల్లో కొనసాగిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కూడా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం చేతుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ న్యాయ విచారణ కోసమే షేక్ హసీనాకు వెనక్కు పంపాలని బంగ్లాదేశ్ కోరింది. 

Tags:    

Similar News