పాకిస్తాన్‌లో 60 మందికి జైలు శిక్ష: అసలు ఏం జరిగింది?

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుకు నిరసనగా 2023 మే 9న అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ అప్పట్లో దేశ వ్యాప్తంగా హింస చెలరేగింది

Update: 2024-12-26 14:02 GMT

పాకిస్తాన్‌లో 60 మందికి జైలు శిక్ష: అసలు ఏం జరిగింది?

పాకిస్తాన్ (Pakistan) లో 60 మందికి రెండు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు గురువారం శిక్ష విధించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుకు నిరసనగా 2023 మే 9న అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ అప్పట్లో దేశ వ్యాప్తంగా హింస చెలరేగింది.

పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (pakistan tehreek insaf) వర్గీయులు సైనిక ప్రధాన కార్యాలయంతో పాటు ఫైసలాబాద్ లోని ఐఎస్ఐ భవనంతో పాటు సైనిక స్థావరాలపై దాడులకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టులోనే 25 మందికి సైనిక కోర్టు జైలు శిక్ష విధించింది. తాజాగా మరో 60 మందికి జైలు శిక్ష విధించారు. అయితే వీరిలో కొందరికి రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష విధించింది కోర్టు. శిక్షకు గురైన వారిలో ఇమ్రాన్ ఖాన్ అల్లుడు హసన్ ఖాన్ నియాజీ కూడా ఉన్నారు.

అసలు ఏం జరిగింది?

ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ తోశఖానా నుంచి తీసుకున్న గిఫ్ట్ ల గురించి సరైన సమాచారం ఇవ్వలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ అప్పట్లోనే తోసిపుచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఐదేళ్లు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

1996లో పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ ను ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసి ప్రజలను తన పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సైనిక నాయకుల మద్దతు పొందిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానిగా ఉన్న సమయంలో రష్యాకు దగ్గరగా వ్యవహరించారు. రియల్ ఏస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ కు అనుకూలంగా ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.2022 ఏప్రిల్ లో పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.అవిశ్వాసం నెగ్గింది. ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు.

Tags:    

Similar News