Gautam Adani: గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు నమోదు

Gautam Adani: భారతదేశంలోనే రెండో అత్యంత ధనవంతుడు, దిగ్గజ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయ్యింది.

Update: 2024-11-21 04:43 GMT

Gautam Adani

Gautam Adani: భారతదేశంలోనే రెండో అత్యంత ధనవంతుడు, దిగ్గజ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయ్యింది. మల్టీ బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు ఈ స్కీములో నిందితులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్ బర్గ్ నవంబర్ 21న ఈ విషయాన్ని నివేదించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఈ క్రమంలోనే అదానీ గ్రూప్..భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు కూడా అభియోగాలు మోపారు. ఈమధ్య గౌతమ్ అదానీ..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన విషయ తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై అక్కడ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ నకు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ..గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులను పెట్టించినట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. ఈమధ్య ట్రంప్ ఎనర్జీ కంపెనీలకు నిబంధనలను సడలించనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వీరు 20ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు ఛాన్స్ ఉన్న సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ పెట్టుబడిదారులు, రుణదాతల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకుపైగా లోన్స్, బాండ్లు సేకరించిందని అభియోగాలు నమోదు అయ్యాయి.

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రకారం అదానీ..అమెరికన్ పెట్టుబడుదారులను మోసగించారని అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదానీతోపాటుగా ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన అల్లుడు సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ క్యాబెన్స్ ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. తప్పుడు స్టేట్ మెంట్స్, ప్రకటనల ద్వారా లబ్దిపొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫారెన్ బిజినెస్ డీలింగ్స్ కింద అమెరికాలో ఉన్న ఫారెస్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు అయ్యాయి. 

Tags:    

Similar News