Bangladesh: బంగ్లాదేశ్ వితండవాదం.. తమ బురదను తుడుచుకోకుండా ఇండియాపై నిందలు!
Bangladesh: బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశంలో అల్ప సంఖ్యాకులకు రక్షణ కల్పిస్తామని తత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పై బంగ్లాదేశలో తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. మైనార్టీ వర్గాలను రక్షించడంలో భారత్ ద్వంద్వ వైఖరి అని బంగ్లాదేశ్ ఆరోపించింది. భారతీయ కథనాలను తిప్పికొట్టాలని బంగ్లాదేశ్ తన జర్నలిస్టులను కోరింది.
బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారతదేశం తీవ్రం స్పందించింది. దేశంలోని అల్ప సంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా హిందువులపై, ఆలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ శుక్రవారం పార్లమెంట్ లో మాట్లాడుతూ..మైనార్టీల సహా పౌరులు ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఢాకాదేనన్నారు. ఢాకాలోని భారత హై కమిషన్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని జైశంకర్ వెల్లడించారు.
బంగ్లాదేశ్ లో ఈమధ్య జరిగిన దుర్గాపూజ వేడుకల్లో ఆలయాలు, పూజ మండపాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. వీటిని తీవ్రంగా పరిగణిస్తుమన్నాని జైశంకర్ అన్నారు. దూర్గాపూజా వేడుకలు శాంతియుతంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే మైనార్టీల రక్షణలో భారత్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని బంగ్లాదేశ్ పేర్కొంది. ఢాకాకు వ్యతిరేకంగా భారత్ మీడియా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపణలు చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ న్యాయ వ్యవహారాల సలహాదారు అసిఫ్ నజ్రుల్ సామాజిక మీడియా మాధ్యమం వేదికగా విమర్శలు చేశారు. భారత్ లో మైనార్టీలుగా ఉన్న ముస్లింపై దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ ఘటనల వల్ల కొంచెం కూడా పశ్చాత్తాపం చెందడం లేదు. భారత్ కు ఉన్న ఇలాంటి ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక అక్రమ కేసులో ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ ను అరెస్టు చేసిన బంగ్లాదేశ్ అధికారులు ఇప్పుడు ఇస్కాన్ ఆర్థిక కార్యకలాపాలపై గురిపెట్టారు. భారతీయులు తెలివైనవారని కొందరు అనుకుంటారని ప్రధాన సలహాదారు యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యాన్ని ప్రతిఘటించాలని పిలుపునిస్తూ ఢాకా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థుల బృందం ప్రదర్శన నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల నేతృత్వంలోని భారీ నిరసనల మధ్య ఆగస్టులో భారతదేశానికి పారిపోయిన పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని.. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్‌లో "సరిహద్దు హత్యలు", మతపరమైన హింస.. మత కలహాలను ప్రేరేపించే ప్రయత్నాలను భారతదేశం చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతుందని, దేశాన్ని అస్థిరపరిచేందుకు మతపరమైన విభేదాలను ఉపయోగించుకుంటోందని వారు ఆరోపించారు.