అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు మళ్లీ కరోనా.. వారం రోజుల్లో రెండోసారి సోకిన వైరస్..
Joe Biden: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మళ్లీ కరోనా సోకింది.
Joe Biden: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మళ్లీ కరోనా సోకింది. నాలుగు రోజుల క్రితం వైరస్ బారిన పడిన ఆయనకు వరుసగా నాలుగు రోజులు నెగిటివ్‌గా తేలింది. అయితే ఐదో రోజు పాజిటివ్‌గా తేలింది. దీంతో మళ్లీ బైడెన్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. వారం రోజుల్లోనే రెండోసారి వైరస్ సోకడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధ్యక్షుడికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైట్‌హౌస్ ప్రకటించింది.
ఆ మేరకు వైట్ హౌస్ ఫిజీషియన్ కెవిన్ ఓ కాన్నర్ నోట్‌ను విడుదల చేశారు. బైడెన్‌ను ఆసుపత్రికి తరలించాల్సినంత తీవ్ర లక్షణాలు ఆయనలో లేవని కెవిన్ తెలిపారు. ఐసోలేషన్ నిబంధనలను బైడెన్ పాటిస్తున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తరువాత బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. 79 ఏళ్ల వయస్సులో బైడెన్ కరోనా బారిన పడడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.