చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కన్నెర్ర
*వెంటనే సాయాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్
Joe Biden: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై పెద్దన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తున్న రష్యాకు ఆర్థిక, మిలటరీ సాయం చేస్తున్న చైనాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీటన్నంటికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిన్‌పింగ్‌ను హెచ్చరించారు. సైనిక సాయం అందిస్తే చైనాకు శిక్ష తప్పదని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా దూకుడుకు మద్దతిస్తే తీవ్ర ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.అయితే ఇదే అంశంపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్‌లో సంప్రదింపులు జరపనున్నారు.