వరల్డ్‌ ట్రెడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడికి 21 ఏళ్లు

అప్పట్లో దాడిలో ప్రాణాలు కోల్పోయిన 3వేల మంది

Update: 2022-09-11 13:00 GMT

వరల్డ్‌ ట్రెడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడికి 21 ఏళ్లు

9/11 Attacks Anniversary: సెప్టెంబరు 11వ తేదీ వస్తే.. అమెరికన్ల వెన్నులో వణుకు పుడుతోంది. న్యూ యార్క్‌లోని జంట టవర్లు వరల్డ్‌ ట్రెడ్‌ సెంటర్‌పై ఒసామా బిన్‌ లాడెన్‌ ఆధ్వర్యంలోని ఆల్‌ఖైదా ఉగ్రవాదులు చేసిన దాడికి నేటితో 21 ఏళ్లు పూర్తయ్యింది. 2001 సంవత్సరంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో 3 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. నాటి భయంకరమైన దృశ్యాలు నేటికీ అమెరికన్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఉగ్రదాడితో ప్రపంచమే నివ్వెరపోయింది. ఈ దాడికి ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు జెట్‌ విమానాలను హైజాక్‌ చేసి న్యూయార్క్‌ ట్విన్‌ టవర్స్‌ వైపు మళ్లించి వాటిపై దాడికి దిగారు.

రెండు విమానాలు వరల్డ్‌ ట్రెడ్‌ సెంటర్‌పై దాడి చేయగా మూడో విమానం పెంటగాన్పై దాడికి దిగింది. నాలుగో విమానంలో ప్రయాణీకులు ఎదురుతిరగడంతో పెన్సెల్వేనియాలోని షాంక్స్‌విల్లేలో కూలిపోయింది. ఈ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదలందరూ సౌదీ అరేబియాతో పాటు ఇతర అరబ్‌ దేశాలకు చెందిన వారేనని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా వెంటాడి వేలాడాయి. ఈ ఉగ్రదాడికి ప్రణాళిక రచించిన వారిలో కీలక ఉగ్రనేత అల్‌ జవహరీని కూడా అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా మట్టుబెట్టింది.

Tags:    

Similar News