Donald Trump: ట్రంప్‌నకు ఊరట.. ఎన్నికల కేసు దర్యాప్తు నిలిపివేత
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పై ఉన్న ఎన్నికల కేసు దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పై ఉన్న ఎన్నికల కేసు దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. దీనిపై పెండింగ్ డెడ్ లైన్స్ ను పక్కన పెట్టాలని స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ కోరారు. ఇందుకు జడ్జి అంగీకరించారు. అధ్యక్షుడిగా ఉన్న వారిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా రక్షణ ఉంటుంది. ఇది ట్రంప్ నకు కలిసి వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అసలు కేసు ఏంటి?
2020 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఈ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బైడెన్ గెలిచిన సమయంలో ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని ట్రంప్ అప్పట్లో వాదించారు. ఈ సమయంలో ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇందుకు ట్రంప్ కారణమని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయాల్సి ఉంది.దీంతో ట్రంప్ పై ఉన్న కేసుల విచారణ నిలిచిపోయింది.
హష్ మనీ కేసులో ట్రంప్ దోషి
హష్ మనీ కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు ఈ నెల 26న న్యూయార్క్ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ను తొలగిస్తానని బహిరంగంగానే ట్రంప్ చెప్పారు.స్మిత్ పై వేటు పడితే తనపై నమోదైన కేసుల నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.