US Elections 2024 Results: అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచారో అధికారికంగా ఎప్పుడు తెలుస్తుంది?
US Elections 2024 Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి.
When will we know about who will be the next US President: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్స్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5 న ఎన్నికలు జరిగితే మరి ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి కమల హారిస్ కు, డోనల్డ్ ట్రంప్ కు మధ్య గట్టి పోటీ నెలకుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.
పెన్సిల్వేనియాలో రికౌంటింగ్‌కి వెళ్తే?
అసలు కౌంటింగే జరగనప్పుడు అప్పుడే పెన్సైలెనియాలో రికౌంటింగ్ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అందుకు కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. 2020 ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ఎలక్టర్ గా గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఓటింగ్ తేడా 1.1 శాతమే ఉంది.
ఈసారి కూడా అక్కడ పోటీ గట్టిగానే ఉందంటున్నారు. గట్టి పోటీ కారణంగా ఒకవేళ గెలుపు, ఓటముల మధ్య తేడా.05 శాతమే ఉన్నట్లయితే.. అక్కడ ఓడిన వారు రికౌంటింగ్ కు పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపిస్తుందనేది వారి ఉద్దేశం. పైగా పెన్సిల్వేనియాలో ఓటర్ నమోదుపై తమకు అనుమానాలు ఉన్నాయని రిపబ్లికన్స్ ఎన్నికలకు ముందే 100 కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంలోనూ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఫలితాలను ఎప్పుడు వెల్లడించారు?
2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి. కానీ అమెరికా టీవీ ఛానెల్స్ మాత్రం నవంబర్ 7వ తేదీ ఉదయాన పెన్సిల్వేనియాలో ఫలితం తేలే వరకు వేచిచూశాయి. ఆ తరువాతే జో బైడెన్ గెలుస్తారని ప్రకటించాయి.
2016 లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ సందర్భంలో అమెరికా కాలమానం ప్రకారం ఎన్నికలు ముగిసిన మరునాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫలితం గురించి అమెరికా మీడియా ప్రకటించింది.
2012 విషయానికొస్తే.. బరాక్ ఒబామా అప్పుడు రెండోసారి అమెరికాకు అధ్యక్షుడయ్యారు. అప్పుడు ఎన్నికలు ముగిసిన రోజు అర్థరాత్రే ఆయన విజయాన్ని అక్కడి టీవీ ఛానెల్స్ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించాయి. అప్పట్లో రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీపై ఆయన డెమొక్రాట్స్ తరపున విజయం సాధించారు.
ఎలక్టోరల్ కాలేజ్‌లో బరాక్ ఒబామాకు 332 ఓట్లు వచ్చాయి. రోమ్నీకి 206 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ విజయంతో అమెరికాలో ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన 11వ అధ్యక్షుడిగా ఒబామా చరిత్ర సృష్టించారు. డెమొక్రాట్స్‌లో ఇలా భారీ మెజారిటీతో గెలిచిన వారిలో ఒబామా మూడో అధ్యక్షుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు.
అమెరికన్ మీడియా వెల్లడించే ఈ ఫలితాలన్నీ కూడా ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే భావించాల్సి ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్‌లో నమోదైన ఓట్లను లెక్కించిన తరువాతే తేలుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.