US: డీప్‌ఫేక్ ఎఫెక్ట్.. AI వాయిస్ రోబోకాల్స్‌పై అమెరికా నిషేధం
US: నకిలీ ఫోన్ కాల్స్ వైరల్ అయిన నేపథ్యంలో నిర్ణయం
US: AI వాయిస్ రోబోకాల్స్‌పై అమెరికా నిషేధం విధిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో డీప్‌ఫేక్ కలకలం సృష్టించింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు AI ఆధారిత ఫోన్‌కాల్స్ ను రూపొందించడంతో.. తప్పుడు ప్రచారానికి తెర తీశారు. దీంతో అప్రమత్తమైన అమెరికా ఇంటలిజెన్స్ విభాగం... కీలక నిర్ణయం తీసుకుంది. AI ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. వెల్లడించారు.
లాభం కోసం కంపెనీలు వీటిని సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఇటీవల జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నికల సమయంలో నకిలీ రోబోకాల్స్ వైరల్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని బైడెన్ చెప్పినట్లు అందులో ఉండటం కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి AI ఆధారిత వాయిస్ కాల్స్ పై అమెరికా నిఘా విభాగం దృష్టి సారించింది.