Unknown pneumonia in Kazakhstan: కరోనాను మించిన కొత్త రోగం! చైనాలో అప్రమత్తం!!
Unknown pneumonia in Kazakhstan: మానవాళికి ఎక్కడో ఎదో తేడా కొట్టింది. భూకంపాలు.. సునామీలు..వరదలు.. యుద్దాలు ఇవేవీ కాకుండా రోగాలతో ప్రజల జీవితాలు మారిపోతున్నాయి.
Unknown pneumonia in Kazakhstan: మానవాళికి ఎక్కడో ఎదో తేడా కొట్టింది. భూకంపాలు.. సునామీలు..వరదలు.. యుద్దాలు ఇవేవీ కాకుండా రోగాలతో ప్రజల జీవితాలు మారిపోతున్నాయి. కరోనా కల్లోలంతో ప్రపంచం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చైనాలో పుట్టిందని చెప్పిన ఈ మహమ్మారి ఇప్పుడు సకల ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తోంది. సాధారణ ప్రజల జీవితం మొత్తం అస్తవ్యస్తం అయిపోతోంది. ఇది ఇంకా ఒక కొలిక్కి రాకుండానే కొత్తగా జీ-4, బ్యుబానిక్ ప్లేగు వంటి వైరల్ వ్యాధులు దూసుకువస్తున్నయంటూ ఇటీవల చైనా చేసిన ప్రకటనలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇవి ప్రపంచ జనాళిని కలవరపాటు లో పడేశాయి. ఇప్పుడు తాజాగా మరో రోగం బాంబు పేల్చింది చైనా! అయితే ఈసారి ఈ వ్యాధి పుట్టిల్లు మాత్రం చైనా కాదు. పొరుగు దేశం అయిన కజికిస్థాన్.
చైనా తన దేశ ప్రజల్ని అప్రమత్తుల్ని చేసింది.. ఎందుకంటే, కరోనా కంటే ప్రమాదకరమైన న్యుమోనియా వ్యాధి విరుచుకుపడే అవకాశం ఉందని చెప్పింది. గ్లోబల్ టైమ్స్ ఈమేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
కజికిస్తాన్ లో గుర్తు తెలియని న్యుమోనియా విరుచుకు పడింది. జనవరి నుంచి ఈవ్యాధి బారిన పడి 1,772 మంది మరణించారు. అయితే, ఒక్క జూన్ నెలలోనే 628 మంది ఈవ్యాధి బారిన పడి చనిపోయారు. దీంతో అక్కడి చైనా రాయబార కార్యాలయం వీచాట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈవ్యాధి కరోనా వ్యాధి కంటే భయంకరంగా కనిపిస్తోందని తెలిపింది. కరోనా కంటే మరణాల రేటు ఈ కొత్త న్యుమోనియాతో అధికంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకూ అయితే ఇవే వివరాలు చైనా ప్రకటించింది. కానీ, ఈ వ్యాధి కోవిడ్ 19 పోలికలతో ఉందా లేదా.. ఇది వేరే కొత్త వ్యధా? ఇది ఎందుకు వస్తుంది వంటి వివరాలు చెప్పలేదు. మరోవైపు కజికిస్తాన్ మాత్రం న్యుమోనియాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం చెప్పింది కానీ, కొత్త వ్యాధిగా చెప్పలేదు. మరి చైనా ఎందుకు ఈవ్యాధిని కొత్త వ్యాధిగా చేబుతోందన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు సమాచారం ఇచ్చినదీ..లేనిదీ తెలియరాలేదు.
చైనాకు చెందిన 'షిన్‌జియాంగ్ వీగర్' అనే స్వయంప్రతిపత్తి గల ప్రాంతం కజకిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో చైనాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం నుంచి చైనాలోకి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలని చైనాలోని ఆరోగ్య నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.
చైనా మీడియా కథనాల ప్రకారం.. కజకిస్తాన్ లో కొత్త రకం న్యుమోనియాతో బాధపడుతున్నవారు కొవిడ్-19 సోకిన వారి కంటే రెండు నుంచి మూడింతలు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కిసికోవా బుధవారం ప్రకటించారు. రోజుకి 300 మంది న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరుతున్నారని కిసికోవా వెల్లడించినట్లు కజకిస్తాన్ కు చెందిన వార్తా సంస్థ కజిన్‌ఫామ్ తెలిపింది.
ఏది ఏమైనా 2020 పూర్తిగా రోగాల వత్సరంగా మారిపోయినట్టు కనిపిస్తోంది.