US Ban Tik Tok: టిక్ టాక్.. వి ఛాట్ ల పై అమెరికా నిషేధం
US Ban Tik Tok | చైనా యాప్ టిక్‌టాక్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు.
US Ban Tik Tok | చైనా యాప్ టిక్‌టాక్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. టిక్‌టాక్ తో పాటు వీచాట్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 20 నుంచి అమెరికాలో ఈ రెండు యాప్ లు డౌన్ లోడ్ చేయడం కుదరదు. ఈ యాప్ లను అన్ని యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని ఆదేశాలు జరీ అయ్యయి. కాగా, టిక్ తొక్ ద్వారా యూజర్ల సమాచారం చైనా చేతుల్లోకి వెల్తోందంటు అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్ చేస్తున్న నేపథ్యంలో భద్రతారంగం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించే విషయాన్ని తమ పరిపాలనా విభాగం పరిశీలిస్తోందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.