Zelenskyy: కాల్పుల విరమణ ప్రసక్తే లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
Zelenskyy: మరిన్ని ఆయుధాలు సమకూర్చుకుని బలోపేతమవుతామన్న జెలెన్‌స్కీ
Zelenskyy: రష్యాతో యుద్ధంలో తాము కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. విరమణ కాలంలో రష్యా మరిన్ని ఆయుధాలను సమకూర్చుకొని బలోపేతమయ్యే అవకాశాలు ఉండడమే అందుకు కారణమని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండెత్తిన తరవాత రష్యా పలుమార్లు కాల్పుల విరమణ ప్రస్తావన తెచ్చినా... వాటిని జెలెన్‌స్కీ తోసిపుచ్చుతూ వచ్చారు.
ఉక్రెయిన్ కోసం తమ ఆయుధోత్పత్తిని తక్షణం పెంచుతామని ఎస్తోనియా అధ్యక్షుడు ఎలార్ కారిస్ ప్రకటించారు. మరోవైపు రష్యా నుంచి అక్రమ వలసలు పెరిగే ముప్పుందన్న భయంతో ఆ దేశంతో తమ సరిహద్దులను మరో నెల రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది.