Volodymyr Zelenskyy: తాము భయపడేది లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
Volodymyr Zelenskyy: రష్యాను ఎదుర్కొంటామన్న జెలెన్‌స్కీ
Volodymyr Zelenskyy: యుద్ధంపై వెనక్కి తగ్గేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఐరోపా దేశాధినేతలో మాట్లాడాని.. ఎవరూ ఏమీ చెప్పడం లేదన్నారు. అందరూ రష్యాను చూసి బయపడుతున్నారని జెలెన్‌స్కీ తెలిపారు. మనం రష్యాను చూసి భయపడేది లేదన్నారు. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రష్యాతో మాట్లాడడానికి కూడా ఎలాంటి భయం లేదన్నారు. రష్యాను ఎదుర్కొంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
రష్యా తననను చంపాలని చూస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. తాను, తన కుటుంబం ఉక్రెయిన్ విడిచి వెళ్లలేదని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యాకు తనే మొదటి టార్గెట్ అని.. రెండో టార్గెట్ తన కుటుంబంని ప్రకటించారు. ఉక్రెయిన్‌ను రాజకీయాంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రెండో రోజు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్‍లో రెండు చోట్ల భారీగా పేలుడు వినిపించింది. రష్యా పారా మిలటీర బలగాలు గోస్టోమెల్ ఎయిర్ ఫీల్డ్‌ను స్వాధీనం చేసుకుంది. బెలారస్ మీదుగా రష్యా హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను తరలించింది. అదే సమయంలో రష్యా సైన్యంపై ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తోంది. రాజధాని కీవ్‌పై దాడికి దిగిన రెండు యుద్ధ విమానాలను కూల్చేసింది. నివాస ప్రాంతాలపై రష్యా దాడికి దిగడంతోనే తాము ఎదురుదాడి చేసి.. యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.
రష్యాకు చెందిన 30 యుద్ధ ట్యాంకులు, 130 ఆర్మీ వాహనాలు, 7 యుద్ధ విమానాలు, 6 హెలికాప్టర్లను ఉక్రెయిన్ ఆర్మీ కూల్చేసింది. అదే సమయంలో 137 మంది ఉక్రెయినియన్లు మృతి చెందారు. వారిలో 10 మంది సైనికులు ఉన్నారు. 316 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.