Earthquake: తుర్కియే, సిరియాలో పెను విషాదాన్ని మిగల్చిన భూకంపం
Earthquake: ఆర్థిక నష్టం సుమారు 80 బిలియన్ అమెరికన్ డాలర్లు
Earthquake: తుర్కియే, సిరియాలో పెను విషాదాన్ని నింపిన భూకంపం ఆ దేశాలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇప్పటి వరకు దాదాపు 37 వేల మంది మృతిచెందినట్లు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే తుర్కియేలోని వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భూకంప ప్రళయం మిగిల్చిన నష్టం విలువ సుమారు 80 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండవచ్చని వెల్లడించాయి.
తీవ్ర భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 25 వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దాదాపు 42వేల ఇళ్లు నేలమట్టం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం నివాస ప్రాంతాలు దెబ్బతినడం వల్లే 70.75 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు టర్కిష్ ఎంటర్‌ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. జాతీయాదాయానికి 10.4 బి.డా, పనిరోజుల పరంగా 2.91 బి.డా నష్టం కలిగించినట్లు తెలిపింది.