H-1B visa: భారతీయ టెకీలకు భారీ ఊరట

H-1B visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెకీలకు ఊరట లభించింది.

Update: 2021-04-02 09:36 GMT

H-1B visa: భారతీయ టెకీలకు భారీ ఊరట

H-1B visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెకీలకు ఊరట లభించింది. తమ కలలు సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌వన్‌ బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్ విధించిన నిషేధానికి గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో టెకీలు ఊపిరిపీల్చుకున్నారు.

ఒక్కసారైనా అమెరికా వెళ్లాలి అక్కడ ఉద్యోగం చేయాలన్నది టెకీల కల. కానీ ఆ కలలకు కళ్లెం వేస్తూ ట్రంప్ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ మళ్లీ భారతీయులకు ఊరట కల్పించారు. గత ప్రభుత్వం హెచ్‌వన్‌ బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకోవడంతో టెకీలకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్‌–1బీ వీసాపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించింది. హెచ్‌1బీతో సహా వలసేతర వీసాలపై తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్‌ 31వరకు నిషేధం విధించిన ట్రంప్ ఆ తర్వాత మార్చి 31 వరకు పొడిగించారు. అయితే బుధవారంతో ఆ గడువు ముగిసిపోయింది. అయితే ట్రంప్ కఠిన నిర్ణయానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్న కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ వీసాపై విధించిన నిషేధం పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో హెచ్‌1బీ వీసా జారీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

ఇక వీసాలపై నిషేధం గడువు ముగియడంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది అమెరికా. 2022 సంవత్సరానికి గాను వీసాల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిసెంబర్ 31 వరకు లాటరీ విధానంలో వీసాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. దీంతో భారతీయ టెకీలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బైడెన్‌ రాకను స్వాగతించిన ఎన్నారైలు వీసాలపై ఆయన తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News