ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎలాగైనా బైడెన్‌ను అధ్యక్ష పీఠం ఎక్కకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ కోర్టుకెక్కారు. ఐతే అవకతవకలు జరిగాయని రుజువు చేసేందుకు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. ఐతే బైడెన్ విజయం సాధించిన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ, డేన్‌కౌంటీల్లో రీకౌంటింగ్‌కు ట్రంప్ పట్టుబట్టారు. దీనికోసం ఏకంగా 3మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. ఐతే అక్కడ కూడా ఊహించని షాక్ తగిలింది. భారీ మొత్తం ఖర్చు చేసి మరీ రీకౌంటింగ్ జరిపిస్తే రిజల్ట్ కాస్తా బైడెన్‌కు ఫేవర్‌గా ఇక్కడ ట్రంప్‌పై బైడెన్ 132 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో బైడెన్ మొత్తం ఆధిక్యం 20వేల 6వందల ఓట్లకు చేరింది.