Pakistan Beggars: హవ్వ హవ్వ.. పరువు పాయె.. గల్ఫ్‌ దేశాలకు పాక్ బిచ్చగాళ్లు..!

Pakistan Beggars: పాకిస్థాన్ ఏటా 4 లక్షల మంది భిక్షగాళ్లను, రోగులను సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తుందిని ఆ దేశం వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి వచ్చే కార్మికులకు గల్ఫ్‌ దేశాలు తలుపులు మూసేస్తున్నాయి.

Update: 2024-08-11 12:23 GMT

Pakistan Beggars

Pakistan Beggars: పాకిస్థాన్‌.. ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది ఉగ్రవాదమే. ఆ దేశం ఇప్పుడు పూర్తిగా రుణాల ఊబిలో చిక్కుకుపోయింది. రుణాల కోసం తొక్కని గడపలేదంటే అతిశయోక్తి కాదేమో. రుణాలను అడుగుతుంటే తమను భిక్షగాళ్లలా చూస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ దేశమే కాదు, ఆ దేశ పౌరుల పరిస్థితి కూడా అంతే అధ్వానంగా మారింది. ఇప్పుడు మిత్రదేశాలైన గల్ఫ్‌ కంట్రీస్‌ పాకిస్థాన్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ దేశాలకు భిక్షగాలను, రోగిష్టులను పంపొద్దంటూ ఇస్లామాబాద్‌కు వార్నింగ్స్ ఇస్తున్నాయి. అసలు గల్ఫ్‌ కంట్రీస్‌లో పాకిస్థాన్ పౌరులు ఏం చేస్తున్నారు? ఎందుకు పాకిస్థానీయులంటే గల్ఫ్‌ కంట్రీస్ మండిపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

దాయది దేశం పాకిస్థాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. సోదర ముస్లిం దేశాల నుంచి అప్పులు అడెక్కొని ఇప్పటికే పరువు పోగొట్టుకున్నది. ఇప్పుడు మరో విషయంలో కూడా ఆ దేశం తన పరువును తనే బజారుకు ఈడ్చుకుంటోంది. అదేమిటో తెలుసుకోవాలంటే.. ముందు పాకిస్థాన్ ఎగుమతుల గురించి తెలుసుకోవాలి. ప్రపంచానికి రెండింటిని పాకిస్థాన్ భారీగా ఎగుమతి చేస్తోంది. అందులో మొదటిది ఉగ్రవాదం. రెండోది చౌక కార్మికులు. ఏటా లక్షలాది మంది పాకిస్థానీ కార్మికులు దేశాన్ని వీడుతున్నారు. వారి ప్రధాన గమ్య స్థానం అరబ్‌ ప్రపంచం. ప్రధానంగా గల్ఫ్‌ కోఆపరేషన్ కౌన్సిల్‌-జీసీసీ దేశాలు. జీసీసీలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, బహ్రెయిన్, ఖతార్‌, కువైట్‌, ఓమన్ దేశాలు ఉన్నాయి. వీటిని జీసీసీ దేశాలని అంటారు.

ఈ ఆరు దేశాలు పాకిస్థానీ వలసదారులను పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాయి. వారిలో చాలా మందిని కార్మికులుగా పని చేసేందుకు అనుమతిస్తున్నాయి. దీంతో అగ్గువకే కార్మికులు దొరుకుతారు. పాకిస్థాన్‌‌కు నిధులు వరద పారుతుంది. అలా వచ్చిన నిధులు రికార్డు స్థాయికి చేరాయి. 320 కోట్ల డాలర్లను పాకిస్థానీ కార్మికులు స్వదేశానికి మళ్లించారు. ఈ నిధుల్లో ఎక్కువగా సౌదీ అరేబియా, యూఏఈ దేశాల నుంచే వచ్చాయి. అసలే ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌‌ విలవిలలాడుతోంది. ఈ నిధులే పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఆయువుగా మారాయి. వీటితోనే పాకిస్థాన్ దిగుమతులకు కొత ఊరట లభిస్తోంది. వాటితోనే దేశాన్ని ఏదో ఒకరకంగా ఇస్లామాబాద్‌ నెట్టుకొస్తోంది.

అయితే ఇప్పుడు పాకిస్థాన్‌‌కు ఉన్న ఈ అవకాశానికి కూడా గండిపడనుంది. పాకిస్థాన్ నుంచి వచ్చే కార్మికులకు గల్ఫ్‌ దేశాలు తలుపులు మూసేస్తున్నాయి. ఎందుకంటే.. దానికి రెండు కారణాలు ఉన్నాయి. పాకిస్థానీ కార్మికుల్లో నైపుణ్యం కొరత నెలకొంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు అడ్వాన్స్‌డ్‌ అవుతున్నాయి. అఖరుకు నిర్మాణ రంగంలోనూ అత్యాధునిక టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. కానీ, చాలా మంది పాకిస్థాన్‌ కార్మికులు వాటిని వినియోగించడం తెలియదు. చాలా వరకు పాకిస్థాన్‌‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కార్మికులే ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వలస వస్తున్నారు. వారిలో చాలా మంది స్కూల్‌ స్థాయిలోనే చదువు మానేసిన వారు ఉన్నారు.

వారంతా నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారే. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీంతో గల్ఫ్‌ కంట్రీస్‌ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. తమకు అవసరమైన నైపుణ్యమున్న కార్మికుల కోసం బంగ్లాదేశ్‌ లాంటి ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. బంగ్లాదేశ్‌ కార్మికులను స్ఫూర్తిగా తీసుకోవాలని పాకిస్థానీ పార్లమెంట్‌ సభ్యులు ఇప్పుడు తమ కార్మికులకు సూచిస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌ ఇప్పుడు లక్షలాది మందికి శిక్షణ ఇవ్వాలని కోరుకుంటోంది. ప్రధానంగా స్కూల్‌ మానేసిన వారిని ఎంచుకుంటోంది. వారందరినీ నైపుణ్యమున్న కార్మికులుగా మార్చాలని యత్నిస్తోంది. ఆ తరువాత వారిని గల్ఫ్‌ దేశాలకు పంపాలని ప్లాన్ వేసింది. ఇది దీర్ఘకాల పరిష్కారం. అయితే ఇది తక్షణమే సమస్యను పరిష్కరించ లేదు.

ఇతర దేశాల కార్మికులతో పోలిస్తే పాకిస్థానీలకు మరీ తక్కువ నైపుణ్యాలు ఉన్నాయి. పాకిస్థానీ కార్మికులను గల్ఫ్‌ దేశాలు వద్దనుకోవడానికి ఇది ఒక కారణం. అయితే రెండో కారణం మాత్రం గల్ఫ్‌ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. పాకిస్థానీ వసలదారుల తీరే అందుకు కారణం. ఆరు జీసీసీ దేశాల్లో నాలుగు దేశాలు ఈ విషయంలో పాకిస్థానీల కారణంగా టెన్షన్ పడుతున్నాయి. తమ దేశానికి భిక్షగాళ్లను, రోగులను పంపకండని ఇస్లామాబాద్‌కు సౌదీ అరేబియా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఏటా 4 లక్షల మంది పాకిస్థానీలు సౌదీకి చేరుకుంటున్నారు. వాళ్లలో చాలా మంది యాత్రికుల వీసా మీద వెళ్తున్నారు.

అక్కడికి చేరుకున్న తరువాత వారంతా భిక్షమెత్తుకుంటున్నారు. అయితే సౌదీ అరేబియాలో భిక్షమెత్తుకోవడం నేరం. అందుకే భిక్షగాళ్లను ఆ దేశం అరెస్టు చేస్తోంది. ఇలా అరెస్టు చేసిన వారిలో 90 శాతం మంది పాకిస్థానీలే ఉన్నట్టు రియాద్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇప్పటికే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటున్న దేశంగా పేరుంది. ఆ దేశం ఇప్పుడు చైనా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ- ఐఎంఎఫ్, గల్ఫ్‌ దేశాల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంది. ఇలాంటి తరుణంలో ఆ దేశ పౌరులు భిక్షగాళ్లుగా మారుతుండడం పాకిస్థాన్‌‌కు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భిక్షగాళ్ల విషయంలో ఇస్లామాబాద్‌కు సౌదీ అరేబియా వార్నింగ్స్‌ ఇచ్చింది. ఇప్పుడు కువైట్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

పాకిస్థానీ నర్సులను విషయంలో కువైట్‌ ఆందోళన చెందుతోంది. రోజువారీ పనులను చేయడానికి పాకిస్థానీ నర్సులు నిరాకరిస్తున్నారు. వారు చేయాల్సిన పనులను వార్డు బాయ్‌లకు అప్పగిస్తున్నారు. అంతేకాదు, స్థానిక భాష అరబిక్‌ను నేర్చుకోవడానికి కూడా ఇష్టపడడం లేదట. ఇక్కడ 6 నెలల పాటు చేసి.. యూరోప్‌ కంట్రీస్‌కు చెక్కేసేందుకు యత్నిస్తున్నారు. అంటే కేవలం తమకు పాస్‌పోర్ట్‌, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ కోసమే పాకిస్థానీ నర్సులు గల్ఫ్‌ కంట్రీస్‌లో పని చేయడానికి మొగ్గుచూపుతున్నారన్నమాట. ఖతార్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేస్తోంది. పని చేసే చోట పాకిస్థానీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ఖతార్ ఆరోపిస్తోంది.

ప్రధానంగా కార్మికులు సేఫ్టీని గాలికొదిలేస్తున్నట్టు చెబుతోంది. అంటే పని చేసే సమయాల్లో తలకు హెల్మెట్‌ ధరించడానికి పాకిస్థానీలు అస్సలు ఇష్టపడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి ఇది తీవ్రమైన సమస్య. ఎందుకంటే కార్మికులు చనిపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూఏఈ ఆరోపణలు మరో రకంగా ఉన్నాయి. పాకిస్థానీలు అనుచిత ప్రవర్తన, నేరపూరితమైన చర్యలకు పాల్పడుతున్నట్టు దుబాయ్ చెబుతోంది. చాలా మంది పాకిస్థానీయులు యూఏఈలో మహిళలకు తెలియకుండా వీడియోలను తీసుకున్నారు. ఈ విషయంలో పాకిస్థానీలపై ఎమిరాటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌కు ఇప్పటికే తమ ఆందోళనలను యూఏఈ వెల్లడించింది.

యూఏఈకి పాకిస్థానీయులతో మరో సమస్య నేరాలు. యూఏఈ నేరాల్లో సగానికి పైగా పాకిస్థానీయులకు లింకులు ఉన్నట్టు దుబాయ్ చెబుతోంది. ప్రధానంగా పాకిస్థానీ కార్మికులతో యూఏఈ తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. మొత్తంగా పాకిస్థానీయుల ప్రవర్తన దారుణంగా ఉంటుందోని గల్ఫ్‌ దేశాలు వాపోతున్నాయి. ఈ విషయం పాకిస్థాన్‌కు కూడా తెలుసు. జీసీసీ దేశాల నివేదికతో ఇప్పుడు పాకిస్థాన్ డ్యామేజ్ కంట్రోల్‌కు యత్నిస్తోంది. అక్కడి చట్టాలను గౌరవించాలంటూ తమ పౌరులకు పాకిస్థాన్ సూచిస్తోంది. ఎక్కడికి వెళ్లినా.. అక్కడి సాంస్కృతి విధానలను గౌరవించాలని హితబోధ చేస్తోంది. అంతకు మించి పాకిస్థాన్ చేయడానికి ఇంకేమీ లేదు.

ఎందుకంటే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొంది. దీనికి తోడు దేశంలో యువతకు ఉద్యోగాలను కల్పించలేకపోతోంది. పాకిస్థాన్ 2022లో ఏడు లక్షలా 50 వేల మంది యువ విద్యావంతులను ఉద్యోగాల కోసం విదేశాలకు తరలిస్తోంది. 2020, 2021తో పోలిస్తే.. 2022లో మూడు రెట్లకు పైగా యువత గల్ఫ్‌ దేశాలకు తరలిపోయింది. ఏడున్నర లక్షల మందిలో 92వేల మంది ఉన్నత విద్యావంతులు ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, అకౌంటెంట్లు. నిజానికి పాకిస్థాన్ సమాజానికి వారంతా అవసరం. కానీ దేశంలో వారు పని చేసే పరిస్థితులు లేవు. వారంతా గల్ఫ్‌ దేశాలకు క్యూ కడుతున్నారు.

గల్ఫ్‌ దేశాలకు ఎక్కువ మందిని ఎగుమతి చేసే దేశాల్లో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. మొత్తంగా పాకిస్థాన్ మాత్రమే కాదు.. ఆ దేశ పౌరులు కూడా భిక్షమెత్తుకుంటున్నారు. పాకిస్థాన్‌‌ పరువును గల్ఫ్‌ దేశాలు బజారుకీడ్చాయి. ఇప్పుడు పాకిస్థాన్ తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసి చీడలా మారింది. ఇప్పుడు బిక్షగాళ్లను ఎగమతి చేసి తన పరువును తనే అరేబియాలో కలుపుకుంటోంది. 

Tags:    

Similar News