Thailand baby pygmy hippo Moo Deng predicted US presidential election results: ప్రపంచమంతా అమెరికా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. అమెరికా అధ్యక్షురాలిగా కమల హరీస్ చరిత్ర సృష్టిస్తారా? లేదంటే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేత సౌధంలో అడుగుపెట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తీర్పు చెప్పనున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కథనంలో ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు.
ప్రస్తుతం అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రిపబ్లిక్ వర్సెస్ డెమొక్రట్స్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సంగతెలా ఉన్నా చివరికి ట్రంప్, కమలా హరీస్‌లలో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ జూలోని పిగ్మీ హిస్పో (నీటి గుర్రం) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిప్పోను అక్కడి జనం చాలా మంది నమ్ముతారు. గతంలో పలు సందర్భాల్లో హిప్పో చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయనేది వారి వాదన. ఇవాళ అమెరికా ఎన్నికల నేపథ్యంలో డోనల్డ్ ట్రంప్, కమలా హరీస్‌లలో ఎవరు గెలుస్తారో అని రెండు పుచ్చకాయల కేకులను సెపరేట్‌గా ఉంచారు. ఒక దానిపై డోనల్డ్ ట్రంప్, మరోదాని పై కమలా హరీస్ పేరును రాసి హిప్పో ముందు ఉంచారు. అప్పుడు హిప్పో వచ్చి డోనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న పుచ్ఛకాయ కేకును తినేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటూ అక్కడి వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారంట. ప్రస్తుతం హిప్పో వీడియో వైరల్‌గా మారింది.
ట్రంప్ వర్సెస్ కమలా హరీస్‌లు నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల బరిలో గట్టి పోటీని ఇస్తున్నారు. ఇటీవల ట్రంప్‌పై ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరగటం కొంత వరకు ఆయనకు ప్రజల్లో సానుభూతి అంశాలుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు కమలా హరీస్ కూడా భారత్ మూలాలు ఉండడం వల్ల అమెరికాలో ఉన్న ఎక్కువ మంది భారతీయుల్ని తనవైపునకు తిప్పుకునేందుకు తనదైన శైలిలో ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. ఇరువురి మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇంతకీ అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు? హిప్పో జోస్యం ఫలిస్తుందా? ట్రంప్‌ను అధ్యక్ష పీఠం వరిస్తుందా? అనేది తెలియాలంటే అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే.
US Elections 2024 Explainer: భారత్‌తో పోల్చుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ కింది వీడియోపై ఓ లుక్కేయండి.