Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్డెక్కిన టీచర్లు

Afghanistan: జీతాలు చెల్లించాలంటూ ధర్నా * పూట గడవడం కష్టంగా ఉందంటూ ఆవేదన

Update: 2021-10-22 03:46 GMT

ఆఫ్గనిస్తాన్ లో టీచర్లు (ఫైల్ ఇమేజ్)

Afghanistan: తమకు జీవనం కష్టమవుతుందని వెంటనే జీతాలు చెల్లించాలని టీచర్లు వేడుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్‌లో వందలాది మంది టీచర్లు రోడ్లెక్కారు. తమకు భారీగా జీతాలు ఏమీ లేవని, వేతనాలు చెల్లించకపోవడంతో పూటగడవడం ఇబ్బందిగా మారిందని, వెంటనే ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హెరాత్‌ ప్రావిన్స్‌లో 10 వేల మంది మహిళా టీచర్లు సహా సుమారు 18 వేల మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. దీంతో కరెంటు బిల్లు కట్టడానికి తమ వద్ద డబ్బులు లేవని, చాలా మంది ఇంట్లో కరెంటు కట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమన్‌గన్‌, నూరిస్థాన్‌ ప్రావిన్స్‌లలో గత వారం వందలాది మంది డాక్టర్లు తమకు జీతాలు చెల్లించాలని ఆఫ్ఘనిస్థాన్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. తమకు గత 14 నెలలుగా జీతాలివ్వడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలీబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో దేశంలో ఆర్థికంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 

Full View


Tags:    

Similar News