అసలు తాలిబన్లు ఎవరు..? ఏడాదికి 15,000 కోట్లు ఆదాయం ఎలా వస్తుంది

Update: 2021-08-16 11:45 GMT

Talibans - Afghanistan: ఆఫ్ఘానిస్తాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు.. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న తాలిబన్లు అసలు ఎవరు.., ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం..!!


తాలిబాన్ అంటే పష్టున్ తెగలకి చెందిన వారు.. పష్టున్ అంటే విద్యార్థి అనే అర్ధం. 3 దశాబ్దాల క్రితం ఆఫ్ఘాన్ నుండి జర్మనీ సోవియెట్ దళాలు ఉపసంహరించుకోవడంతో దేశంలోని క్లిష్ట పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోడానికి అప్పటి తాలిబాన్ నాయకుడు ఒమర్ మహమ్మద్.. ఐఎమ్(ఇండియన్ ముజహుద్దిన్) టెర్రర్ సంస్థ సహాయంతో దేశంలోని పలు రంగాలపై పట్టు సాధించారు. తాలిబన్లు ఒక్కసారిగా దేశంలో పట్టురావడంతో మహిళలు చదువుకోవద్దని, తప్పనిసరిగా బుర్ఖాలు ధరించాలని ఇలా మహిళలపై ఆంక్షలు అమలు చేశారు.

2001 సెప్టెంబర్ 11న అమెరికాపై బిన్ లాడెన్ దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకున్న బిన్ లాడెన్ ని అప్పగించడానికి అప్పటి ప్రెసిడెంట్ రాబ్బని వారికి అనుకూలంగా ఉండే తాలిబాన్ నాయకుడు ఇండియన్ ముజహిద్దిన్ కమాండర్ ఒమర్ మహమ్మద్ లు నిరాకరించడంతో 2001లో అమెరికా భద్రత బలగాలు ఆఫ్ఘానిస్తాన్ ని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి.

దాదాపుగా 20 ఏళ్ళు తమ ఆధీనంలో ఉన్న తరువాత ఇటీవలే అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ను నుండి తమ భద్రత దళాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు కేవలం నెలల వ్యవధిలోనే ఆఫ్ఘాన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవడంతో పాటు చివరకి దేశ సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఎదురించి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు. ఇక ప్రస్తుతం ని ఆక్రమించుకున్న తాలిబాన్ల దగ్గర ఉన్న ఎంత డబ్బు ఉందో తెలిసి ప్రపంచ దేశాలు నిజంగానే షాక్ అయ్యాయి.

మైనింగ్, డ్రగ్స్, మారణ ఆయుధాల ద్వారా సుమారుగా ఏడాదికి 15,000 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. రకరకాల సంస్థల నుండి వారికి వచ్చే విరాళాలతో తమ సైన్యాన్ని బలపరుచుకొని చివరికి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ తాలిబన్లు.

Tags:    

Similar News