Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు షాకిచ్చిన తాలిబన్లు

Afghanistan: విదేశీ కరెన్సీల వినియోగంపై నిషేధం విధింపు

Update: 2021-11-03 10:17 GMT
దేశీయ కరెన్సీ మాత్రమే వాడాలని తాలిబన్ల హుకుం జారీ (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు రోజుకో కొత్త నిర్ణయంతో ప్రజలకు షాకిస్తున్నారు. విదేశీ కరెన్సీల వినియోగంపై తాలిబన్లు నిషేధం విధించారు. "దేశ ఆర్థిక పరిస్థితి అవసరాల దృష్ట్యా ఆఫ్ఘానీలు లావాదేవీల్లో దేశీయ కరెన్సీని మాత్రమే వినియోగించాలన్నారు. విదేశీ కరెన్సీ వినియోగం నుంచి కచ్చితంగా బయటపడాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లాహ్‌ ముజాహిద్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఆఫ్ఘాన్ ఆర్థిక పరిస్థితి పతనం అంచున ఉన్నవేళ తాలిబన్ల తాజా నిర్ణయం మరింత ఇబ్బంది పెడుతోంది.

మరోవైపు అమెరికా దళాలు ఉన్న సమయంలో అఫ్గానిస్థాన్‌లో అత్యధికంగా డాలర్‌నే వినియోగించేవారు. కానీ, అమెరికన్లు ఆఫ్ఘాన్ నుంచి వెళ్లిపోయాక డాలర్ల సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా అమెరికా ఫెడ్‌ దగ్గర దాదాపు 9 బిలియన్‌ డాలర్ల అఫ్గాన్‌ రిజర్వులు ఉన్నాయి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికా వాటిని నిలిపివేసింది. ఈ నిధులను విడుదల చేయాలని ఇప్పటికే తాలిబన్లు కోరినా ఎలాంటి ఫలితం లేదు. దీనికి తోడు విదేశీ సహాయం కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు నిధుల సరఫరాను నిలిపివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిలియన్ల మంది ఆఫ్ఘన్లు పేదరికంలోకి జారిపోయే ప్రమాదం తప్పేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News