Taliban: ప్రపంచ దేశాలకు తాలిబన్ల రిక్వెస్ట్

Taliban: తమ పాలనను అధికారికంగా గుర్తించాలని విజ్ఞప్తి

Update: 2021-10-31 09:39 GMT

ప్రపంచ దేశాలకు తాలీబన్స్ రిక్వెస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Talibans: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘాన్‌ పౌరులు ఆకలికేకలు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో తమ పాలనను అధికారికంగా గుర్తించాలని ప్రపంచ దేశాలను తాలిబన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే, వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలన్న తాలిబన్లు ఆఫ్ఘాన్ ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు.

మరోవైపు తమ విజ్ఞప్తులను పరిగణించకుంటే మున్ముందు అంతర్జాతీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉందంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ హెచ్చరించే ప్రయత్నం చేశారు. చివరిసారి అమెరికా, తాలిబన్ల మధ్య సరైన దౌత్యసంబంధాలు లేకపోవడం వల్లే యుద్ధం తలెత్తిందని ముజాహిద్‌ వ్యాఖ్యానించారు. చర్చలు, రాజకీయ సయోధ్య వల్ల అప్పుడు సమస్యలు పరిష్కారమై ఉండేవన్నారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడం అఫ్గాన్‌ ప్రజల హక్కు అని ముజాహిద్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News