ఆప్ఘనిస్తాన్‌లో రాక్షస పాలన.. తాలిబన్ల బహిరంగ శిక్షలు, వేధింపులు షురూ

Afghanistan: మేం మారాం.. అని చెప్పారు. అమెరికాకు మద్దతు ఇచ్చిన వారిని క్షమించాం అని మాటిచ్చారు.

Update: 2021-08-21 01:42 GMT

ఆప్ఘనిస్తాన్‌లో రాక్షస పాలన.. తాలిబన్ల బహిరంగ శిక్షలు, వేధింపులు షురూ

Afghanistan: మేం మారాం.. అని చెప్పారు. అమెరికాకు మద్దతు ఇచ్చిన వారిని క్షమించాం అని మాటిచ్చారు. మహిళలపై ఆంక్షలు ఉంబోవు అని ప్రకటించారు. విదేశీయులపై దాడులు చేయబోం అని వాగ్దానం చేశారు కూడా. కానీ నాలుగైదు రోజుల్లోనే తాము మేక వన్నె పులులమని రుజువు చేసుకున్నారు. " సైతాన్‌ హమేషా, సైతాన్‌ హీ హోతాపై " అనే నానుడిని నిజం చేశారు. తమది రాక్షస పాలనేనని నిరూపించారు. ఇది ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల నిజస్వరూపం.

90ల నాటి వారి అరాచక పాలనను మళ్లీ కొనసాగిస్తామని చెప్పకనే చెబుతున్నారు. బహిరంగ శిక్షల అమలు మహిళలపై ఆంక్షలు విదేశీయులపై కాల్పులు అమెరికా మద్దుతుదారుల ఇళ్లలో సోదాలు భారత రాయబార కార్యాలయాల్లో లూటీ వాహనాలు, కీలక ప్రతాలను ఎత్తుకెల్లడం లాంటి పరిణామాలన్నీ వారి పాలన షరా మామూలుగానే ఉండనుందనే సంకేతాలను ప్రపంచానికి అందజేస్తున్నాయి. యుద్ధ కల్లోల దేశంలో మళ్లీ మునుపటి అరాచక వాతావరణమే నెలకొననుందని స్పస్టమవుతోంది.

నిన్నమొన్నటి దాకా మహిళలకు సముచిత గౌరవమిస్తామని చెప్పిన తాలిబన్లు ఇప్పుడు వారు ఉద్యోగాలు చేయకూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని కార్యాలయాల దగ్గర సాయుధ తాలిబన్లు గస్తీ కాస్తున్నారు. ఆఫీసులకు వచ్చిన మహిళలను వెనక్కి పంపుతున్నారు. అటు తాలిబన్లను పలు ఉగ్రవాద సంస్ధలు అభినందనలతో ముంచెత్తుతున్నాయి.

ఇక ఆప్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఇంకా పరిపాలనను అధికారికంగా ప్రారంభించలేదు. అమెరికాతో జరిగిన ఒప్పందం ప్రకారం వారు ఇంకా ఆదిశలో చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈనెల 31లోగా తమ సేనలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఆతర్వాతే తమ పాలన ప్రారంభమవుతుందని తాలిబన్లకు చెందిన అనధికారిక వర్గాలు ప్రార్థనల సందర్భంగా వెల్లడించాయి.

Tags:    

Similar News