Afghanistan: కో ఎడ్యుకేషన్ పై నిషేధం విధిస్తూ తాలిబన్ల ఉత్తర్వులు
* హెరాత్ ప్రావిన్స్ లో తాలిబన్ల ఫత్వా * ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అమలు చేయాలని ఆదేశం
Afghanistan: ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు తమ తొలి ఫత్వా జారీ చేశారు. హెరాత్ ప్రావిన్స్ లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇకపై బాల బాలికలు కలసి చదువుకునే వీలుండదు. సమాజ విచ్ఛిన్నానికి మూలకారణం ఈ కో ఎడ్యుకేషన్ వ్యవస్థేనని దానిని సమూలంగా నాశనం చేయాలని తాలిబన్లు పిలుపునిచ్చారు. మహిళలను గౌరవిస్తామని షరియా చట్టం ప్రకారం నడుచుకుంటే చాలనీ మొదట చెప్పిన తాలిబన్లు చేతల్లో తమ నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.