Talibans: మళ్లీ స్వాతంత్య్రం కోల్పోయిన అఫ్ఘానిస్థాన్‌ ప్రజలు

Talibans: ఖతార్‌ నుంచి కాబూల్‌ చేరిన తాలిబన్‌ నేతలు * అధికార బదిలీలో ‘శాంతి మంత్రం’

Update: 2021-08-16 03:45 GMT

కాబుల్ చేరుకున్న తాలిబన్లు (ఫైల్ ఇమేజ్)

Talibans: రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛా వాయువులు పీల్చిన అఫ్ఘానిస్థాన్‌ మళ్లీ స్వాతంత్య్రం కోల్పోయింది. యావత్‌ దేశం దాదాపుగా తాలిబన్ల వశమైపోయింది. నిన్న ఉదయం కాబూల్‌ శివార్‌లో ఉన్న తాలిబన్లు సాయంత్రానికి నగరంలోకి దూసుకుపోయారు. అయితే.. శాంతియుత మార్గంలో అధికార బదలాయింపు కోసం ఎదురు చూస్తున్నట్లు తాలిబన్లు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న తాలిబన్ల పొలిటికల్‌ బ్యూరో అధినేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌, మరో నేత మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌, ఇతర నేతలు కాబూల్‌ చేరుకున్నారు. వారికి అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వ పెద్దలు కాబూల్‌ విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ పరిణామాన్ని బట్టి.. అఫ్ఘాన్‌ సర్కారు అధికార బదలాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 

నిన్న సాయంత్రం తాలిబన్ల బృందం అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు. ఈ లోగా.. అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రత్యేక విమానంలో తజికిస్థాన్‌కు వెళ్లిపోయాడు. కీలక సమయంలో అష్రఫ్‌ ఘనీ పారిపోయాడంటూ ప్రభుత్వ పెద్దలు శాపనార్థాలు పెట్టారు. అష్రఫ్‌ ఘనీ తాత్కాలిక అధికార బాధ్యతలను తాలిబన్‌ నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక తాలిబన్‌ నేతలు పాలనను చక్కబెట్టే వ్యవహారాల్లో బిజీ అయ్యారు. మొత్తం 34 రాష్ట్రాలకు 29ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తమ అధికారిక రాచముద్రతో పలు డిక్రీలు జారీ చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, దుకాణాల యాజమాన్యాలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడుతుండడంతో పలు దేశాలు తమ రాయబార ఆఫీసులను ఖాళీ చేస్తున్నాయి.

Tags:    

Similar News