అప్ఘాన్ లో మొదలైపోయిన తాలిబన్ల అరాచకాలు.. ఇంటింటినీ గాలిస్తున్న..

Afghanistan: అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు మొదలైపోయాయి.

Update: 2021-08-16 13:44 GMT

అప్ఘాన్ లో మొదలైపోయిన తాలిబన్ల అరాచకాలు.. ఇంటింటినీ గాలిస్తున్న..

Afghanistan: అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు మొదలైపోయాయి. కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు ఇంటింటినీ గాలిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మాజీ సైనికులు , జర్నలిస్టులు ఇలా విభాగాల వారీగా తనిఖీలు మొదలు పెట్టారు. ఇప్పటికే 80 మంది అప్ఘాన్ పౌరులను అరెస్టు చేసిన తాలిబన్లు వారందరినీ దొంగలని ప్రకటించారు. తాలిబన్ల అరాచకానికి హడలి పోతున్న కాబూల్ ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్ల దీస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా దేశం దాటేయాలని ఆతృత పడుతున్నారు. అప్ఘానిస్థాన్ పార్లమెంటు ను కూడా తాలిబన్లు కబ్జా చేశారు. సాయుధ బలగాలతో పవిత్రమైన పార్లమెంటులోకి చొరబడ్డారు. వెంట తుపాకులు ధరించి పార్లమెంట్ అంతటా కలియదిరిగారు.

అప్ఘానిస్థాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు కలవర పడుతున్నాయి. అమెరికా తన సిబ్బంది తరలింపుకు ప్రాధాన్యత ఇస్తుండగా, అప్ఘాన్ శరణార్దులకోసం భారత్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని కాబూల్ పంపింది. అయితే అప్ఘాన్ గగన తలం మూసి వేసి ఉండటంతో ఆ విమానాలు అక్కడకు చేరుకోలేకపోయాయి. ఇదిలా ఉండగా అప్ఘాన్ లో ఉన్న సిక్కు సమాజం కాబూల్ లోని ఒక గురుద్వారాలో తలదాచుకుంది.

Tags:    

Similar News