Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో బాలికా విద్యకు మంగళం
* దేశంలో సగం జనాభాకు దూరమైన చదువు * ఆడపిల్లలకు ప్రైమరీ విద్య అవసరం లేదన్న తాలిబన్లు * 1-5వ తరగతి వరకే ఆడపిల్లలకు అనుమతి
Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో బాలికా విద్యకు పూర్తిగా మంగళం పాడేశారు తాలిబన్లు. ఆడపిల్లలు గడప దాటొద్దని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలో ప్రైమరీ విద్యకు ఆడపిల్లలను దూరం చేసిన ఏకైక దేశంగా ఆప్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. దీంతో ఆప్ఘన్ లో సగం జనాభాకు చదువే లేకుండా పోయింది.
ఆరు నుంచి 12 తరగతుల మగపిల్లలు మాత్రమే ఇక నుంచి స్కూళ్లకు హాజరు కావాలంటూ తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఆదేశాలు జారీ చేసింది. ఇక చదువు చెప్పే టీచర్లు కూడా మగవారే ఉండాలని ఆదేశించింది. ఆడపిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకూ మాత్రమే చదువుకోడానికి అర్హులు.. ఆపై వారికి చదువులు అక్కరలేదు.. ఇంటి పట్టునుండి కుటుంబ సేవలు చేసుకోవాలని గతంలోనే తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.