Suez Canal: సూయజ్‌ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌకలో కదలిక

Suez Canal: సూయజ్‌ కెనాల్‌లో అడ్డంగా ఇరుక్కుపోయిన భారీ నౌక ఎట్టకేలకు కదిలింది.

Update: 2021-03-29 16:00 GMT

Suez Canal: సూయజ్‌ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌకలో కదలిక

Suez Canal: సూయజ్‌ కెనాల్‌లో అడ్డంగా ఇరుక్కుపోయిన భారీ నౌక ఎట్టకేలకు కదిలింది. నౌక ముందుభాగాన ఇసుక, బురదను భారీగా తోడివేయడంతో ప్రస్తుతం ఎవర్‌ గివెన్‌ నీటిపై తేలుతున్నదని ఈజిప్ట్ఠ‌ టుడే మ్యాగజైన్‌ ట్వీట్‌ చేసింది. 2 లక్షల టన్నులకు పైగా బరువున్న ఈ భారీ నౌకను కదిలించడం అత్యంత శ్రమతో కూడిన వ్యవహారంగా మారింది. ఎట్టకేలకు శ్రమ ఫలించింది. నౌక కింద నీరు పారేవిధంగా చేసి నౌక వెనుక భాగాన్ని నెట్టడంతో 80 శాతం సరైన దిశలోకి వచ్చింది. త్వరలోనే సూయజ్‌ కెనాల్‌లో రవాణాను సాధారణ స్థాయికి తీసుకొస్తామని కెనాల్‌ అథారిటీ ప్రకటించింది. రేపు ఉదయం సముద్రపు పోటు వచ్చి నీటి మట్టం పెరగగానే రాకపోకలు మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News