భూమికి ప్రమాదం పొంచి ఉందా.. అసలు ఈనెల 24న ఏం జరగబోతోంది?
NASA: భూమికి ప్రమాదం పొంచి ఉందా? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందా?
NASA: భూమికి ప్రమాదం పొంచి ఉందా? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందా? అసలు ఈనెల 24న ఏం జరగబోతోంది? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏం చెప్పింది? అసలు భూమికి పొంచివున్న ప్రమాదం ఏంటి?
భూమికి భారీ ప్రమాదం పొంచి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. భూమికి అతి సమీపంగా భారీ గ్రహశకలం వెళ్లబోతోందని నాసా ప్రకటించింది. దాదాపు ఒక ఫుట్ బాల్ స్టేడియం పరిమాణమున్న ఉల్క భూమికి దగ్గరగా రాబోతోంది. ఇది భూమికి అతి సమీపంగా దూసుకుపోనుంది. సెకనుకు 8 కిలోమీటర్ల వేగంగా ఇది భూమి వైపు దూసుకురానుందని నాసా తెలిపింది. అయితే, ఈ గ్రహ శకలం భూమిని తాకే అవకాశం లేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ చెబుతోంది. అయినా, అత్యంత ప్రమాదకరంగా దూసుకొస్తున్న ఈ భారీ గ్రహ శకల గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు నాసా వెల్లడించింది.