శ్రీలంకలో దారుణ పరిస్థితులు.. మరోసారి ఎమర్జెన్సీ ప్రకటన..

Sri Lanka Crisis: ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు...

Update: 2022-05-07 05:19 GMT

శ్రీలంకలో దారుణ పరిస్థితులు.. మరోసారి ఎమర్జెన్సీ ప్రకటన..

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు.

ఈ ద్వీప దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇదో రెండోసారి. ఐదు వారాల క్రితం నిరసనకారులు అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. దీంతో ఆ సమయంలో అధ్యక్షుడు గొటబాయ కొన్నిరోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.

అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. దీనికి తోడు శుక్రవారం వందల సంఖ్యలో నిరసనకారులు, విద్యార్థులు ఆ దేశ పార్లమెంట్‌‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులతో అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News