Sri Lanka: కరోనా దెబ్బకు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక
Sri Lanka: ప్రస్తుతం చమురు దిగుమతి చేసుకునే సామర్థ్యం శూన్యం
Sri Lanka: కరోనా దెబ్బకు శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం చమురు దిగుమతి చేసుకునేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బు లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆ దేశంలోని పెట్రోల్ పంపులన్నీ ఒక్కటొక్కటిగా మూడపడిపోతున్నాయి. శ్రీలంకకు భారీ ఎత్తున పర్యాటకులు వెళుతున్నందున విదేశీ మారక నిల్వలు పెద్ద మొత్తంలోనే ఉండేవి. అయితే కరోనా దెబ్బకు పర్యాటక రంగం ఛిన్నాభిన్నమైపోయింది. ఫలితంగా శ్రీలంక వచ్చే విదేశీ పర్యాటకులు ఒక్కసారిగా తగ్గిపోయారు. ఫలితంగా అప్పటికే అందుబాటులో ఉన్న విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన శ్రీలంక.. ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితికి చేరుకుంది.