South Africa: ఆందోళనలు, దోపిడీలతో దక్షిణాఫ్రికాలో 72మంది మృతి
సైన్యం రంగంలోకి దిగినా మారని పరిస్థితులు సౌత్ ఆఫ్రికా విదేశాంగ మంత్రితో మాట్లాడిన జైశంకర్
South Africa: దోపిడీలు, లూటీలతో సౌత్ ఆఫ్రికా అల్లకల్లోలంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడి అరెస్టుతో మొదలైన అల్లర్లు రణరంగాన్ని తలపిస్తున్నాయి. షాపులపై దాడులకు పాల్పడుతున్న స్థానికులు అందినంతా దోచుకుంటున్నారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగినా పరిస్థితులు ఏమాత్రం చక్కబడలేదు. ఈ అల్లర్లలో 72 మరణించగా 12వందల 34మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.