COVID-19 vaccine: కోవి షీల్డ్ సింగిల్ డోస్‌తోనే 65 శాతం రక్షణ
COVID-19 vaccine: వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకున్నా కరోనా ఇన్‌ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది.
COVID-19 vaccine: వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకున్నా కరోనా ఇన్‌ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ లేదా ఫైజర్ టీకాలు వృద్ధులు, ఇతరత్రా జబ్బులున్నవారికి సింగిల్ డోస్‌తోనూ రక్షణ కల్పిస్తున్నాయని ఆ అధ్యయనం తెలిపింది. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడం, మరణాలు తగ్గుతాయని వివరించింది. అయితే టీకా పొందినవారికి కరోనా సోకవచ్చని ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా వారి ద్వారా ఇతరులకు వ్యాపించవచ్చని కూడా హెచ్చరించింది. అందువల్ల వ్యాక్సిన్ పొందినప్పటికీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరవొద్దని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, నేషనల్ స్టాటిస్టిక్స్ శాస్త్రవేత్తలు తెలియచేశారు.