భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్.. యూఎన్ ఓ వద్దన్నా..వెనక్కి తగ్గని ప్రభుత్వం..

Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తి తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది.

Update: 2023-04-26 07:15 GMT

భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్.. యూఎన్ ఓ వద్దన్నా..వెనక్కి తగ్గని ప్రభుత్వం..

Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తి తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. సింగపూర్ కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించాడనే కేసులో తంగరాజు దోషిగా తేలాడు. ఈ క్రమంలోనే అతడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2018 అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది. నాటి తీర్పును అనుసరిస్తూ ఛాంగీ సెంట్రల్ జైలులో తంగరాజు సుప్పయ్యకు ఉరిశిక్ష అమలు చేశారు.

తంగరాజు సుప్పయ్య ఉపాధి నిమిత్తం సింగపూర్ లో స్థిరపడ్డాడు. అయితే కేజీ గంజాయిని మలేషియా నుంచి సింగపూర్ కు అక్రమంగా తరలిస్తుండగా తంగరాజు అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. ఇది 2014 ఫిబ్రవరిలో జరిగింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తంగరాజుపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో 2018లో సింగపూర్ న్యాయస్థానం తంగరాజుకు ఉరిశిక్ష విధించింది.

తంగరాజు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా అమలు చేయాలని అతని కుటుంబసభ్యులు, మరణ శిక్షను వ్యతిరేకిస్తున్న యాక్టివిస్టులు సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఆందోళనలు సైతం నిర్వహించారు. సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్ కు సైతం లేఖ రాశారు. ఈ కేసులో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. తంగరాజుకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని సూచించింది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం వినిపించుకోలేదు. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంటూ సింగపూర్ ప్రభుత్వం తంగరాజును ఉరి తీసేందుకే మొగ్గు చూపింది.

ఇక ఇదే కేసులో నాగేంద్రన్ ధర్మలింగం అనే మానసిక వికలాంగుడిని సైతం సింగపూర్ ప్రభుత్వం వదలకుండా ఉరి తీసిందంటే మాదక ద్రవ్యాల విషయంలో అక్కడి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సింగపూర్ దాని సరిహద్దు దేశాలతో పోల్చితే చాలా కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది.

Tags:    

Similar News