లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయులు విడుదల

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయ పౌరులను కిడ్నాపర్లు విడుదల చేసినట్లు ట్యునీషియాలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు స్వయంగా..

Update: 2020-10-12 02:36 GMT

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయ పౌరులను కిడ్నాపర్లు విడుదల చేసినట్లు ట్యునీషియాలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు స్వయంగా అక్కడి భారత రాయబారి పునీత్ రాయ్ కుందల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వారిని సెప్టెంబర్ 14 న లిబియాలోని అశ్వరీఫ్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల చెరనుంచి బయటపడిన భారతీయుల సంక్షేమాన్ని భారతదేశానికి లిబియాలో రాయబార కార్యాలయం లేదా మరియు ట్యునీషియాలోని భారత మిషన్ లిబియాలోని చూసుకుంటుందని స్పష్టం చేశారు.

గత నెలలో లిబియాలో తమ ఏడుగురు పౌరులను కిడ్నాప్ చేశారని, వారిని విడిపించేందుకు కృషి చేస్తున్నామని భారత్ గురువారం ధృవీకరించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో కిడ్నాప్ చేసిన కార్మికులు సురక్షితంగా ఉన్నారని, వారిని విడిపించే ప్రయత్నాల కోసం ట్యునీషియాలోని భారత మిషన్ లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

'ట్యునీషియాలోని మా రాయబార కార్యాలయం, లిబియాలోని భారతీయ పౌరుల సంక్షేమానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలను తీసుకుంది, కిడ్నాప్ విషయం సంబంధిత లిబియా ప్రభుత్వ అధికారులకు, అక్కడ ఉన్న అంతర్జాతీయ సంస్థలకు కూడా చేరింది, భారతీయ పౌరులను రక్షించడంలో వారి సహాయం కోరాం. వారు పనిచేస్తున్న కంపెనీ యజమాని కిడ్నాపర్లను సంప్రదించి, భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని.. రుజువుగా ఛాయాచిత్రాలను చూపించారు' అని అనురాగ్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఇదిలావులంటే భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లిబియాకు వెళ్లకుండా ఉండాలని 2015 సెప్టెంబర్‌లో భారతీయ పౌరులకు సలహా ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత, 2016 'మే'లో భద్రతా ప్రమాణాలు మరింతగా క్షీణించాయని.. ఈ దృష్ట్యా పూర్తి ప్రయాణ నిషేధాన్ని విధించింది. ఈ ప్రయాణ నిషేధం ఇప్పటికీ అమలులో ఉంది.  

Tags:    

Similar News