Stock Market: బేర్‌మన్న స్టాక్‌మార్కెట్లు

Stock market: అమెరికా ఫెడ్ రిజర్వ్‌ నిర్ణయాలే కారణం

Update: 2022-01-24 06:34 GMT

బేర్‌మన్న స్టాక్‌మార్కెట్లు

Stock Market: ప్రారంభంలోనే బేర్‌ బేరుమన్నది. స్టాక్‌ మార్కెట్ల సూచీలు భారీగా పడిపోయాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పతమైంది. ప్రస్తుతం 312 పాయింట్ల నష్టంతో 58వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 25 సంస్థలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. 219 పాయింట్లు పడిపోయి ప్రస్తుతం 17వేల వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, ఒమిక్రాన్‌ వ్యాప్తి వంటి అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. మార్కెట్‌ ఆరంభం కావడంతోనే రెండు దేశీ సూచీలు నష్టాలపాలయ్యాయి. రెండు వారాలుగా మార్కెట్‌లో కరెక‌్షన్‌ కొనసాగుతుండటంతో దలాల్‌స్ట్రీట్‌ దడదడలాడుతోంది.

Tags:    

Similar News