రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు పేల్చివేత

Update: 2020-10-14 15:34 GMT

రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును పోలాండ్‌ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును విసిరిందట. ఐతే అది పేలకుండా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు దగ్గర భూమిలో 12మీటర్ల లోతులో పాతుకుపోయిన ఐదు టన్నుల బరువున్న బాంబును.. అధికారులు గతేడాది గుర్తించారు. 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు టాల్‌ బాయ్‌ అని పేరు పెట్టారు. ఐతే నిన్న ఈ బాంబును బాల్టిక్‌ సీ సముద్రంలో ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చేసేందుకు నేవీ అధికారులు ప్రయత్నించారు. ఐతే ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News