Caste Discrimination: కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్

Caste Discrimination: కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా అమెరికాలోని సియాటెల్ రికార్డు సృష్టించింది.

Update: 2023-02-22 14:00 GMT

Caste Discrimination: కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్

Caste Discrimination: కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా అమెరికాలోని సియాటెల్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు సియాటెల్‌ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కుల వివక్షను నిషేధించాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల డిమాండ్ తీవ్ర రూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చట్టాలు చేయడమంటే ఆయా నిర్దిష్ట సమాజాలను కించపరచడమేనని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు. కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర కౌన్సిల్‌లో ఓటింగ్ జరిగింది. 6-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. కాగా ఇండియన్ అమెరికన్ క్షమా సావంత్ ఈ ప్రతిపాదనను కౌన్సిల్‌లో తీసుకొచ్చారు. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గత వారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.

ప్రవాస భారతీయులు అత్యంత ఎక్కువగా ఉండే దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికాలో 1980 నాటికి 2 లక్షల 6 వేల మంది భారతీయులు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పెరిగింది. కాగా గత మూడేళ్ల కాలంలో అమెరికాలోని అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధించడానికి ముందుకొచ్చాయి. 2019 డిసెంబర్‌లో బోస్టన్ సమీపంలోని బ్రాండీస్ యూనివర్సిటీ తమ వివక్ష రహిత విధానంలో కులాన్ని చేర్చింది. అలా కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా యూనివర్సిటీగా అది గుర్తింపు పొందింది. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కాల్బీ కాలేజ్, బ్రౌన్ యూనివర్సిటీ వంటివీ అదే మార్గంలో నడిచాయి. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా 2021లో ఈ తరహా విధానం తీసుకొచ్చింది.

Tags:    

Similar News