శ్వాసకోశ నాళాలపై కరోనా ప్రభావం వివరించే ఫొటోలు విడుదల

Update: 2020-09-15 12:04 GMT

కరోనా మహమ్మారిపై శాస్త్రవేత్తలు మరో కీలక అంశాన్ని కనుగొన్నారు. వైరస్ సోకిన వ్యక్తి శ్వాసకోశ కణాల ఫోటోలను విడుదల చేశారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ ఏవిధంగా చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందీ ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో సార్స్-కోవ్-2 ఇన్పెక్షన్ వ్యాప్తిస్తుందనేది సులభంగా అర్ధమయ్యేలా పిక్స్‌ను విడుదల చేశారు. శ్వాసనాళాల్లో వైరస్‌ కణాలు శరీరమంతటా వ్యాపించడంతో పాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్దంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టినట్లు చూపించారు.

మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్ ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్‌ ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ఫోటోలు ప్రచురితమయ్యాయి. మొదట నలుపు, తెలుపు ఫోటోలు విడుదల కాగా తర్వాత కలర్స్ ఫోటోలను విడుదల చేశారు. ఈ పిక్స్ శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతో పాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నంచి ఇతర భాగాలకు వ్యాపింపచేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు.

అధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కోవిడ్-19 నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు వెల్లడించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా నివాసం ఉన్న వైరస్ కణాలని పరిశోధకులు కనుగొన్నారు. కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్‌లు ధరించడం ద్వారా మెదట శ్వాసనాళాల్లోకి వైరస్ వెళ్లకుండా అడ్డుకోగలిగే అవకాశాలున్నాయని వెల్లడించారు.



Tags:    

Similar News