డేంజర్ వైరస్‌లకు బర్త్ ప్లేస్‌గా డ్రాగన్ కంట్రీ.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు
China: డేంజర్ వైరస్‌లకు డ్రాగన్ కంట్రీ బర్త్ ప్లేస్‌గా మారినట్లు కనిపిస్తోంది.
China: డేంజర్ వైరస్‌లకు డ్రాగన్ కంట్రీ బర్త్ ప్లేస్‌గా మారినట్లు కనిపిస్తోంది. తాజా పరిశోధనల్లో చైనా ఒకటీ రెండూ కాదు ఏకంగా 71 రకాల వైరస్‌లను ఇంటర్‌నేషనల్ సైంటిస్టులు గుర్తించడం హాట్‌టాపిక్ అవుతోంది. వీటిలో 18 రకాలలను డేంజర్ వైరస్‌లుగా గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి జంతువుల నుంచే మనుషులకు సోకినట్లు పరిశోధనల్లో తేలింది.
ఈ నేపధ్యంలోనే చైనాలోని మాంసం మార్కెట్లే టార్గెట్‌గా చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం శాస్త్రవేత్తలు కీలక పరీక్షలు నిర్వహించారు. 16 రకాల జాతులకు చెందిన 17వందల 25 వన్య ప్రాణులపై పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.