School Bus Accident : ఘోరప్రమాదం..స్కూల్ బస్సు బోల్తా..మంటలు అంటుకుని 12 మంది విద్యార్థులు సజీవదహనం

School Bus Accident : సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే ఆ బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. విద్యార్థులతోపాటు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-07-11 02:48 GMT

School Bus Accident: ఘోరప్రమాదం..స్కూల్ బస్సు బోల్తా..మంటలు అంటుకుని 12 మంది విద్యార్థులు సజీవదహనం

School Bus Accident: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం విద్యార్థులను తీసుకుని వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. డ్రైవర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్స్‌లోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మరో ఏడుగురు తీవ్రగాయాలు అయ్యాయని..వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. నగరానికి పశ్చిమాన 70 కిలోమీటర్ల (45 మైళ్ళు) దూరంలో ఉన్న మెరాఫాంగ్‌లో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మినీబస్ పూర్తిగా అగ్నికి ఆహుతైందని టెలివిజన్ చిత్రాలు చూపించాయి.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే ఘోరం జరిగిందని తెలిపారు. "ఒక ప్రైవేట్ స్కాలర్ ట్రాన్స్‌పోర్ట్ మినీబస్ మెరాఫాంగ్‌లోని కోకోసి-వెడెలా ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది విద్యార్థులు వారి డ్రైవర్‌ ప్రాణాలను బలిగొంది" అని గౌటెంగ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులందరూ ఆరు నుంచి 13ఏండ్లమధ్య వయస్సున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాఠశాల బస్సు ను పికప్ ట్రక్ వెనక నుంచి ఢీ కొట్టిందని..దీంతో స్కూల్ బస్సు బోల్తాపడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు."ఈ విషాద సంఘటనతో నేను చాలా బాధపడ్డాను" అని గౌటెంగ్ విద్యా మంత్రి మాటోమ్ చిలోన్ అన్నారు.

Tags:    

Similar News