Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

Satya Nadella: ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ కు సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ను చైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు అప్పగించింది.

Update: 2021-06-17 06:39 GMT

మైక్రోసాఫ్ట్ ఛైర్మెన్ గా సత్యనాదెళ్ల (ఫైల్ ఇమేజ్)

Satya Nadella: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కు చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియామకం అయ్యారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ కు సీఈవోగా ఉన్న ఆయనకు చైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు అప్పగించింది. బోర్డు చైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అదికారం ఆయనకు దక్కనుంది. వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంది అని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. కాగా, 2014 ఫిబ్రవరిలో స్టీవ్‌ బాల్‌మెర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల ఎన్నో సేవలు అందించారు. 1975లో స్థాపించిన సంస్థకు కొత్త రూపురేఖలు తీసుకువచ్చిన ఘటన నాదెళ్లకు ఉంది. తన పదవీకాలం ప్రారంభం నుంచి సంస్థను ఎందో అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్‌ వచ్చే వారం తన విండో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యొక్క కొత్త తరాన్ని ఆవిష్కరించనుంది. ఇది ప్రపంచంలోనే డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో దాదాపు మూడోవంతు కంప్యూటర్లకు శక్తినిస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ 'సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. అయితే అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన నియామకం అన్వేషణ అనివార్యమైంది.

Tags:    

Similar News