US Election 2024 Results: అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్: ఎవరీ సారా మెక్ బ్రైడ్?

US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు ట్రాన్స్ జెండర్ తొలిసారి ఎన్నికయ్యారు.

Update: 2024-11-06 07:33 GMT

US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్: ఎవరీ సారా మెక్ బ్రైడ్?

US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు ట్రాన్స్ జెండర్ తొలిసారి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సారా మెక్ బ్రైడ్ గెలిచారు. రిపబ్లిక్ పార్టీ తరపున జాన్ వేలెన్ 3 తో ఆమె పోటీ పడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలయ్యాయి. వేలేన్ కు 57.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. డెలవేర్ లో మార్పు కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, పునరుత్పత్తికి సంబంధించిన పాలసీలపై ఫోకస్ చేస్తానని తెలిపారు.

ఎల్ జీ బీ టీ క్యూ జాతీయ కార్యకర్తగా సారా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు 3 మిలియన్లకు పైగా విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఓ ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్ జెండర్ గా ఆమె గుర్తింపు పొందారు. 2020లో డెలవేర్ లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్ గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమోక్రట్లకే మద్దతిస్తున్నవారు.

ఎవరీ సారా?

1990 ఆగస్టు 9న సారా విల్మింగ్టన్ లో పుట్టారు. తండ్రి డేవిడ్, తల్లి సాల్లే మెక్ బ్రైడ్. తండ్రి లాయర్. క్యాబ్ కల్లోవే స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ కు ఫౌండర్. 2009లో ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2013లో అమెరికన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2011లో అమెరికన్ యూనివర్శిటీ స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. చిన్నతనం నుంచి ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. డెలవేర్ లో పలు రాజకీయ ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు.  

Tags:    

Similar News