సంచలన వీడియోను రిలీజ్‌ చేసిన అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ

Update: 2021-02-17 13:00 GMT

సంచలన వీడియోను రిలీజ్‌ చేసిన అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ

అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్‌ చేసింది. ఇప్పుడా ఆ వీడియో సోషల్‌ మీడియాలో యమ స్పీడ్‌గా చక్కర్లు కొడుతోంది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా ట‌వ‌ర్‌ను కేవలం కొన్ని సెకన్లలో టవర్‌ను నేలమట్టం చేశారు. దాన్ని కూల్చివేసే దృశ్యాలను రికార్డ్‌ చేసి, మరో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఎయిర్‌క్రాఫ్ట్‌లకు దారి చూపించేందుకు ఈ డెల్టా టవర్‌ను 1989లో నిర్మించారు. అయితే అధికారులు డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు. గత సెప్టెంబర్‌ వరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని ఉద్దేశంతో ఈ టవర్‌ను నేలమట్టం చేసినట్లు నాన్సీ వోల్మర్‌ వెల్లడించారు.


Tags:    

Similar News