Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ట్రంప్ కంటే బైడెన్ బెటరన్న పుతిన్
Putin: ట్రంప్ కంటే బైడెన్ బెటరన్న పుతిన్
Putin: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా తాము కలిసి పనిచేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. కానీ, ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ మేలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ రెండోసారి గెలుపొందాలని రష్యా ఆకాంక్షించిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆయన మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్ గెలవాలని తాను కోరుకుంటానన్నారు.
బైడెన్ అనుభవం, అంచనావేయగల నేత అని పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన పుతిన్.. తాను డాక్టర్‌ని కాదని, ఆ విషయాలపై కామెంట్స్ చేయడం సరైందికాదన్నారు. బైడెన్ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్ అన్నారు. కొన్ని విషయాల్లో వారి వైఖరుల్లో చాలా తప్పులు, లోపాలున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని తానే స్వయంగా బైడెన్‌కు తెలియజేశానని..పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లోని రష్యన్లను కాపాడడానికి, దేశ రక్షణకు నాటో నుంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికే సైనిక చర్యను ప్రారంభించామని పుతిన్ పేర్కొన్నారు.