Russia Ukraine War: ఉక్రెయిన్ అమాయక దేశం కాదు.. రష్యా సైన్యం వెనక్కి..
Russia Ukraine War: ఇస్తాంబుల్ చర్చలపై ఉక్రెయిన్‌కు సందేహాలు...
Russia Ukriane War: నెల రోజులుగా సాగుతున్న ఉక్రెయిన్- రష్యా మధ్య కీలక ముందడుగు పడింది.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు సక్సెస్ అయినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. అయితే చర్చల్లో హామీ ఇచ్చినట్టుగా రష్యా వెనక్కి తగ్గుతుందా? అంటే.. అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఉక్రెయిన్‌ను కూడా అనుమానం పట్టి పీడిస్తోంది. అయితే ఉక్రెయిన్ అమాక దేశం కాదని.. దేనికైనా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఉక్రెనియన్లు దేనికైనా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో కేవలం రాజధాని కీవ్, చెర్నిహైవ్ శివారులోని తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి మాత్రమే రష్యా అంగీకరించింది. అయితే దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్, ఖేర్సన్, మైకోలైవ్, తూర్పున ఉన్న సుమీ, ఖార్కివ్‌ను చుట్టుముట్టిన మాస్కో సేనల వెనక్కి తీసుకోవడంపై రష్యా స్పందించలేదు. దీంతో ఇస్తాంబుల్‌లో రష్యా ఇచ్చిన హామీలపై ఉక్రెయిన్‌కు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా మాట మారిస్తే.. తాము కూడా వెనక్కి తగ్గమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాను పరోక్షంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ అమాయ దేశం కాదని స్పష్టం చేశారు. 34 రోజుల యుద్ధంలో ఉక్రెనియన్లు ఎంతో నేర్చుకున్నారని చెప్పారు. డాన్‌బాస్‌లో ఎనిమిదేళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం పోరాటం ప్రపంచానికి తెలుసని వెల్లడించారు. నెల రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉక్రెయిన్, రష్యా దేశాలు కీలకమైన ముందడుగు వేశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి మొగ్గు చూపాయి.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఇరుదేశాల ప్రతినిధుల మద్య మూడు గంటల పాటు జరిపిన చర్చలు సక్సెస్ అయినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్నిమైవ్ సమీపంలోని తమ కార్యకలాపాలు తగ్గించుకునేందుకు రష్యా అంగీకరించింది. ఇవి కేవలం తొలి విడత చర్చలే.. ఈ ముందడుగుతో.. పుతిన్, జెలెన్‌స్కీ సమావేశానికి మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇస్తాంబుల్ చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రష్యా వెనక్కి తగ్గుతుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంలో ఉక్రెయిన్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక ఐరోపా దేశంపై జరిగిన అతి పెద్ద దాడి.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య. ఈ యుద్ధంలో వేలాది మంది మృత్యువాత పడ్డారు. 40 లక్షల మందికి పైగా ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయారు. పలు నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అటు రష్యాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ ఎదురుదాడితో రష్యా కూడా తీవ్రంగా సైన్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆపేయడం తప్ప మరో మార్గం ఇరు దేశాలకు కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో చర్చలకు ఉక్రెయిన్, రష్యా సిద్ధమయ్యాయి. గతంలోనూ చర్చలు జరిగినప్పటికీ అవి మాత్రం ఫలించలేదు. దాడులను ఆపితేనే చర్చలకు వస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు పదే పదే స్పష్టం చేశారు.